Vishal : సీనియర్ హీరో విశాల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సాయిధన్సికతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన సుందర్ సీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కలయికలో గతంలో 12 ఏళ్లక్రితం మదగదరాజ అనే సినిమా వచ్చింది. అది రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తోంది.
Read Also : Nayanthara : చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ.. పిక్స్ వైరల్
ఈ సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు తమన్నా, ఇంకొకరు కాయడు లోహర్. వీరిద్దరి అందాలకు కుర్రాళ్లలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. మరీ ముఖ్యంగా తమన్నా ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తమన్నా మాస్ అందాలకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు కాయడు లోహర్ కూడా ఇలాంటి అందాలతోనే కుర్రాళ్లను ఊపేసేందుకు రెడీ అవుతోంది. కాబట్టి ఇలాంటి టైమ్ లో కత్తిలాంటి ఈ ఇద్దరు భామలు విశాల్ పక్కన కనిపిస్తే కథ మామూలుగా ఉండదని అంటున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే అవుతుంది. ప్రస్తుతం విశాల్ ఫుల్ స్పీడ్ గా మంచి కథలను ఎంచుకుంటున్నాడు. సుందర్ సినిమాల్లో కమర్షియల్ యాంగిల్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తాడో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాతనే విశాల్ పెళ్లి ఉండే ఛాన్స్ ఉంది.
Read Also : Udhayanidhi Stalin : నటి గ్లామర్ ఫొటోలు షేర్ చేసిన డిప్యూటీ సీఎం.. ఒకటే రచ్చ
