Vishal: లంచగొండి సెన్సార్ అధికారి బాగోతం బట్టబయలు చేసిన విశాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal Sensational allegation on Mumbai CBFC Officer Corruption: మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ ఇప్పుడు ఒక సెన్సార్ అధికారి లంచగొండితనం గురించి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయం మీద విశాల్ ఒక సుదీర్ఘ ట్వీట్ చేస్తూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. ఇక అవినీతిని వెండితెరపై చూపిస్తున్నారు కానీ నిజ జీవితంలో అది సరి కాదని పేర్కొన్న ఆయన ఇది జీర్ణించుకోలేకపోతున్నా అని అంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై కార్యాలయంలో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.
Movies Releasing: మూవీ లవర్స్ కి పండుగే.. రెండు రోజుల్లో 15 సినిమాలు
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
2 లావాదేవీలుగా స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు విడుదలైన సినిమా నుండి చాలా ఎక్కువ వాటా నాపేరున ఉన్నందున సంబంధిత మధ్యవర్తి మేనగాకి డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నా గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకు వెళ్తున్నాను. ఇలా చేయడం నా కోసం కాదు సినిమాలు చేయబోతున్న నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి పోయిందా అందుకు అవకాశమే లేదు. అందరూ చూడడానికి సాక్ష్యం కూడా ఇస్తున్నా సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేసారు.
#Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l
— Vishal (@VishalKOfficial) September 28, 2023
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!