Site icon NTV Telugu

Vishal : దాని కోసమే ఇన్నేళ్లు పెళ్లి చేసుకోలేదు.. విశాల్ కామెంట్స్

Vishal & Sai Dhanshika

Vishal & Sai Dhanshika

Vishal : హీరో విశాల్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మొన్ననే తాను ప్రేమించిన హీరోయిన్ ధన్సికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నేను తొమ్మిదేళ్లుగా ధన్సికతో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ తమిళ నడిగర్ సంఘం కట్టిన తర్వాత అందులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ధన్సిక కూడా ఒప్పుకోవడం వల్లే ఇన్నేళ్లు ఆగాం. మరో రెండు నెలల్లో ఆ సంఘ భవనం కంప్లీట్ అవుతుంది. అందులోనే మా పెళ్లి జరుగుతుంది. దాంట్లో ఆడిటోరియం కూడా బుక్ చేశాం. త్వరలోనే మా పెళ్లి అందులో జరుగుతుంది అంటూ తెలిపాడు విశాల్.

Read Also : Poorna : గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ.. రెండోసారి..!

గతంలో నడిగర్ సంఘ ఎన్నికల్లో విశాల్ పోటీ చేసినప్పుడే ఈ ప్రామిస్ చేశాడు. సంఘ భవనంలోనే తాను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మొత్తానికి అన్న మాట ప్రకారమే అందులో పెళ్లి చేసుకుంటున్నాడు. ధన్సికతో విశాల్ చాలా సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాడు. కానీ ఇన్నేళ్లు ఈ విషయాన్ని దాచి పెట్టాడు. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ లో తమ పెళ్లిని ప్రకటించాడు. అప్పటి నుంచి ఇతగాడి పెళ్లి కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

Read Also : Mrunal Thakur : సోఫాలో పడుకుని వయ్యారాలు చూపిస్తున్న మృణాల్

Exit mobile version