మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ ఇటివలే రిలీజ్ చేశారు. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన షాట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ వాయిస్ ఓవర్ బయటకి వచ్చిన ‘విరూపాక్ష’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢనమ్మకానికి మూలం, ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు, అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వచ్చే సమయంలో ‘విరూపాక్ష’ టైటిల్ రివీల్ అయ్యింది. గ్లిమ్ప్స్ ఎండ్ లో సాయి ధరమ్ తేజ్ లుక్ ని మేకర్స్ రివీల్ చేశారు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ కూడా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని భాషల్లో టైటిల్ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్, రేపు ఉదయం 10:30 నిమిషాలకి టైటిల్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే ‘విరూపాక్ష’ తెలుగు వెర్షన్ గ్లిమ్ప్స్ కి ‘ఎన్టీఆర్’ వాయిస్ ఓవర్ ప్రధాన బలంగా నిలిచింది, మరి ఇతర భాషల్లో ఈ గ్లిమ్ప్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చే స్టార్ హీరోస్ ఎవరు అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ‘సంయుక్తా మీనన్’ హీరోయిన్ గా నటిస్తున్న ‘విరూపాక్ష’ మూవీని 2023 ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
Hugely applauded Captivating Title Glimpse of #Virupaksha will now be released in Hindi, Tamil, Kannada & Malayalam.
Tomorrow at 10:30AM 📣
@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings @GTelefilms pic.twitter.com/1AMhfYbf9I— SVCC (@SVCCofficial) December 13, 2022