Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Virupaksha Is Not Karthik Dandu Debut Film

Karthik Dandu: విరుపాక్ష ఇతని ఫస్ట్ మూవీ కాదు… ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా?

Published Date :April 24, 2023 , 2:31 pm
By Shiva Kranthi
Karthik Dandu: విరుపాక్ష ఇతని ఫస్ట్ మూవీ కాదు… ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే ట్యాగ్ నుంచి డైరెక్టర్ గా మారాడు కార్తీక్ దండు. ఏప్రిల్ 21న రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ విరుపాక్ష సినిమాతో కార్తీక్ దండు సూపర్ హిట్ కొట్టాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ రాబడుతోంది. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది అంటే విరుపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ సమ్మర్ సీజన్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చిన విరుపాక్ష మూవీని కార్తీక్ దండు బాగా రాసుకోని, అంతే బాగా తెరకెక్కించాడు అనే కామెంట్స్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. విరుపాక్ష ఒక డైరెక్టర్స్ ఫిల్మ్ అనే కామెంట్స్ వినిపిస్తుండడంతో సుకుమార్ శిష్యుడికి ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట. అయితే అందరూ అనుకుంటున్నట్లు కార్తీక్ దండుకి విరుపాక్ష మొదటి సినిమా కాదు, ఇది అతని రెండో సినిమా. ఎనిమిదేళ్ల క్రితమే దర్శకుడిగా మొదటి సినిమా చేసిన కార్తీక్ దండు,  2015లో ‘భం భోలేనాథ్’ అనే సినిమా చేశాడు.

నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా నటించిన ఈ కామెడీ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. అప్పటినుంచి సుకుమార్ క్యాంప్ లో ట్రావెల్ అవుతూ వచ్చిన కార్తీక్ దండు, థ్రిల్లర్ కథతో విరుపాక్ష సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టాడు. డైరెక్టర్ అవ్వడం కన్నా ముందు రైటర్ గా మారిన కార్తీక్ దండు, 2014లో వచ్చిన నిఖిల్ ‘కార్తికేయ’ సినిమాకి మూల కథని అందించాడట. కార్తికేయ సినిమా కూడా ఒక గుడి చుట్టూ అల్లిన థ్రిల్లర్ కావడం విశేషం. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిఖిల్ ని హీరోగా నిలబెట్టింది. ఎట్టకేలకు మొదటి సినిమా చేసిన ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మూవీ చేసి హిట్ కొట్టడం అంటే మాటలు కాదు. వేరే ఎవరైనా అయితే మొదటి సినిమా ఫ్లాప్ అవ్వగానే ఇక మనకి ఇండస్ట్రీలో అవకాశాలు రావనే అర్ధం చేసుకోని ఈ ఎనిమిదేళ్లలో ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయే వాళ్లేమో. అలా వెళ్లకుండా ఇక్కడే ఉంటూ వచ్చాడు కాబట్టే ఈరోజు కార్తీక్ దండు ఖాతాలో విరుపాక్ష లాంటి సాలిడ్ హిట్ పడింది. మరి ఈ  యంగ్ డైరెక్టర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? ఎవరితో ఉంటాయి అనేది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bham Bholenath Karthik Dandu
  • Karthik Dandu
  • Sai Dharam Tej Karthik Dandu
  • Virupaksha
  • Virupaksha Collections

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions