రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా సాయి పల్లవికి ఈ సినిమా నేషనల్ అవార్డ్ దక్కడం ఖాయమని, ఆమె నటన అద్భుతమని నెటిజన్స్ తో పటు సినీతారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రికార్డ్ వసూళ్ల దిశగా సాగతున్న ఈ సినిమా డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్నదని టాక్ నడుస్తోంది.
ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నదని సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే అభిమానులకు మేకర్స్ చేదు న్యూస్ చెప్పనున్నారని తెలుస్తోంది. అన్ని సినిమాలు లాగా ఈ సినిమాను నాలుగు వారాల తరువాత ఓటిటీలో రిలీజ్ చేయాలనుకోవడం లేదట మేకర్స్.. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించాలని, ఇప్పుడే ఓటిటీలో విడుదల చేసేస్తే ఒక మంచి సినిమాను థియేటర్ లో చూసే ఫీల్ ను మిస్ అవుతారని ‘విరాట పర్వం’ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేయడం లేదట.. అయితే ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతున్న కారణంగా మరికొద్దిరోజుల్లో ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్. మరి ఈ సినిమా ఓటిటీ లో ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.