OTT Viewership Survey: కరోనా కంటే ముందే ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది ఓటీటీ. ఈ ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అన్నమాట. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను తరువాత టీవీలో ప్రసారం అయ్యేకంటే ముందే వీటి ద్వారా స్ట్రీమింగ్ చేయాలన్నది ప్లాన్. కరోనా కంటే ముందే ఇండియాలో ఓటీటీ వినియోగం ఉన్నా కరోనా తరువాత బాగా పెరిగింది. ఇక తాజాగా ఓటీటీలను ఇండియాలో ఎక్కువ వీక్షించేది ఎవరంటే? అనే సర్వే చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక తాజా సర్వే ప్రకారం 2023 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 823 మిలియన్ల మంది ఉన్నారని తేలింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిలో 86% మంది ఓటీటీలను వీక్షిస్తున్నారని వెల్లడైంది.
Tapsee Pannu: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన సొట్ట బుగ్గల సుందరి
ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు 53%(442M) అంటే సింహ భాగం గ్రామీణ ప్రాంతం వారే ఉండటం విశేషం. ఇందులో స్త్రీ పురుష నిష్పత్తి పరంగా చూస్తే 46:54గా ఉంది. అంటే స్త్రీలు 46 శాతం చూస్తుంటే పురుషులు 54 శాతం చూస్తున్నారు. ఇక అంతే కాదు ఓవరాల్గా 57 శాతం మంది స్థానిక భాషల్లో కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు అని ఆ సర్వే తేల్చింది. అంటే ఆ లెక్కల ప్రకారం తెలుగు, తమిళ్, మలయాళం కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఇండియాలో ఇప్పుడు ఉన్న టాప్ ఓటీటీల విషయానికి వస్తే నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్ స్టార్ , జీ 5, ఆల్ట్ బాలాజీ , సోనీ లివ్ , జియో సినిమా , వూట్ ఉన్నాయి. తెలుగులో ఆహా కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.