Vikrant Rona: సుదీప్ చిత్రానికి సమర్పకుడిగా సల్మాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సినిమాలకు స్టార్స్ పేర్లు జత చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తారని ఆ మధ్య చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు. అలానే పలు తెలుగు సినిమాలకూ ఆయన ఉత్తరాదిన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదే ధోరణిలో కన్నడ చిత్రసీమ కూడా సాగుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ప్రతిష్ఠాత్మక త్రీడీ చిత్రం ‘విక్రాంత్ రోణ’ హిందీ వర్షన్ కు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ తెలుపుతూ, చిన్న వీడియోను విడుదల చేశారు. ఇతర భారతీయ భాషల్లోనూ ఎవరెవరు ఈ సినిమాతో ముడిపడబోతోంది త్వరలో తెలియచేస్తామని చెప్పారు.
విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ‘విక్రాంత్ రోణ’లో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ భండారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాకు విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్. ప్రపంచవ్యాప్తంగా ‘విక్రాంత్ రోణ’ జూలై 28న విడుదల కానుంది. ఇటీవల సుదీప్, అజయ్ దేవ్ గన్ మధ్య జాతీయ భాషకు సంబంధించిన వార్ సోషల్ మీడియాలో జరిగిన నేపథ్యంలో ఈ చిత్రానికి ఉత్తరాదిన ఎలాంటి స్పందన లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
I am still spell bound by the visuals brother @KicchaSudeep Happy to present the Hindi version of #VikrantRona the biggest 3D experience in Indian cinema.@anupsbhandari @JackManjunath @SKFilmsOfficial @shaliniartss @InvenioF @ZeeStudios_ #VikrantRona3DJuly28 #VR3dJuly28 pic.twitter.com/C5ZJWvcfVK
— Salman Khan (@BeingSalmanKhan) May 16, 2022
తాజావార్తలు
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!