పాన్ ఇండియా సినిమాలకు స్టార్స్ పేర్లు జత చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తారని ఆ మధ్య చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు. అలానే పలు తెలుగు సినిమాలకూ ఆయన ఉత్తరాదిన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదే ధోరణిలో కన్నడ చిత్రసీమ కూడా సాగుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ప్రతిష్ఠాత్మక త్రీడీ చిత్రం ‘విక్రాంత్…