Dubai: టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచర్ ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TFCC: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023′ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్బంగా `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023′ బ్రోచర్ ను సోమవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్’ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. టియస్ ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రసన్న కుమార్, కె. యల్. ఎన్. ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ , శ్రీశైలం, నటి శుభశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మళ్లీ ప్రతాని రామకృష్ణ ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్ గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందన్నది నా ఆలోచన. అలాగే తెలంగాణ లో అద్భుతమైన టూరింగ్ స్పాట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్ తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే మరిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది” అని అన్నారు.
టియస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ, “ప్రతాని రామకృష్ణ ఇస్తోన్న ఈ అవార్డ్స్ కి ప్రభుత్వం తరఫు నుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ లభిస్తుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఈ అవార్డ్స్ సక్సెస్ ఫుల్ గా జరిగేలా చూస్తాం. అలాగే తెలంగాణలో ప్రస్తుతం టూరిజం స్పార్ట్స్ పెరిగాయి. విజయేంద్రప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం” అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, “టియఫ్ సీసీ నంది అవార్డ్స్ 2021, 22 సంవత్సరాలకు గానూ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు ఈ అవార్డ్స్ ఇవ్వనున్నాం. ఈ ఫంక్షన్ దుబాయ్ లో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా అవార్డులు ఇస్తాం. ఆయన డేట్ తీసుకుని త్వరలో అవార్డ్స్ ప్రదానం ఎప్పుడు జరిగేదీ అధికారికంగా ప్రకటిస్తాం” అని చెప్పారు. తనకు జరిగిన సత్కారానికి కె.కె. సెంథిల్ సమాధానం చెబుతూ, “మనం చేసే పనికి గుర్తింపు వస్తే అదొక ఆనందం. ఆ గుర్తింపు, ప్రోత్సాహాన్నిఇచ్చేవి అవార్డ్స్ . అలాంటి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ ఆపివేయడం దురదృష్టకరం. మళ్లీ ప్రతాని గారు నంది అవార్డ్స్ స్టార్ట్ చేయడం సంతోషకరమైన విషయం” అని అన్నారు.
Also Read
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?