PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్‌గా మారింది
- ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్‌గా మారింది
- త్వరలో ‘గగన్‌యాన్’ మిషన్‌కు కూడా సిద్ధంగా ఉన్నాం
- 6G టెక్నాలజీ కూడా రాబోతుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్బోర్న్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ‘‘మన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరుకున్నాయి. మన ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరించుకున్నాయి.’’ అని తెలిపారు.
‘‘ఇప్పుడు భారతదేశం తన సొంత ‘గగన్‌యాన్’ మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి సిద్ధమవుతోందని.. అలాగే సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించే లక్ష్యం దిశగా పనిచేస్తోంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G మార్కెట్‌గా అవతరించింది. భారతదేశం ‘మేక్ ఇన్ ఇండియా’ 6G టెక్నాలజీపై వేగంగా పనిచేస్తోంది. గత 12 సంవత్సరాలలో భారతదేశవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా నగరాలకు మెట్రో నెట్‌వర్క్‌లు విస్తరించాయి. నేడు భారతదేశంలో ప్రతిరోజూ 12.5 మిలియన్లకు పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. మేము భారతదేశంలో నమో భారత్ రాపిడ్ రైల్, వందే భారత్ వంటి సెమీ-హై-స్పీడ్ నెట్‌వర్క్‌లను వేగంగా విస్తరిస్తున్నాం.’’ అని తెలిపారు.
Also Read
‘‘భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూస్తోంది. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో మీరు దాని ప్రదర్శనను చూసే ఉంటారు. ఉగ్రవాదుల స్థావరాలపై పేలుళ్లు జరిగాయి. కానీ వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన ఈ భారీ దాడి మీకు గర్వాన్ని కలిగించిందా లేదా?.’’ అని అన్నారు.
Excited to be among the Indian community in Melbourne. Their energy and enthusiasm are truly unmatched. They are one of the strongest pillars of India-Australia friendship. https://t.co/dG9F5vj5jr
— Narendra Modi (@narendramodi) July 9, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?