Vijay-rashmika: గీతా గోవిందం చిత్రం రష్మిక మందన్న దశ తిరిగిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నదని వార్తలు గుప్పుమంటూనే వస్తున్నాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని, విజయ్ తనకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడని రష్మిక చెప్తూ వస్తోంది. ఇక విజయ్ సైతం రష్మిక తనకు మంచి ఫ్రెండ్ అని, ఇలాంటి ప్రేమ రూమర్లు తాను పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. ఇక ఫ్రెండ్స్ లానే ఈ జంట నైట్ పార్టీలకు, ఫంక్షన్స్ కు, ఈవెంట్లకు జంటగా వెళ్తున్నారా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వీరిద్దరి మధ్య సీక్రెట్ ప్రేమాయణం నడుస్తోందని, వారు బయటపడడం లేదని అంటున్నారు.
తాజాగా ఈ లవ్ బర్డ్స్ మాల్దీవులకు పయనమయ్యారు. ఇద్దరు క్యాజువల్ డ్రెస్సులో ఒకే రోజు ఎయిర్ పోర్టులో కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలే తన హిందీ సినిమాలను పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ కొంత గ్యాప్ తీసుకొని మాల్దీవులకు చెక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటు రౌడీ హీరో సైతం లైగర్ తరువాత ఖుషీ సినిమాను పూర్తిచేసి కొద్దిగా గ్యాప్ తీసుకొని రిలాక్స్ కోసం మాల్దీవులకు పయనమయ్యాడని అంటున్నారు. ఏదిఏమైనా వీరిద్దరూ జంటగా మాల్దీవులకు వెళ్లడం అనేది సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్ళికి ముందే ఇలా మాల్దీవులకు వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లో ఈ లవ్ బర్డ్స్ కూడా జాయిన్ అయ్యినట్లు తెలుస్తోంది. మరి వీరు జంటగా వెళ్తున్నారా..? లేక విడివిడిగా వెళ్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.