Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఈ చిన్నది సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాకా.. అందాల ఆరబోతతో పాటు బూతు పురాణం కూడా నేర్చుకున్న తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కూడా మొదలుపెట్టింది. విజయ్ వర్మ తో తాను రిలేషన్ లో ఉన్నాను అంటూ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చిన ఈ భామ.. లస్ట్ స్టోరీస్ 2 లో అతడితో కలిసి ఘాటు రొమాన్స్ చేసి షేక్ .. షేక్ ఆడిస్తోంది. ఇక ఇప్పుడు తమన్నా కన్నా అతడి బాయ్ ఫ్రెండ్ విజ్జయి వర్మ గురించి మాట్లాడాలంటే.. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో తెగ మెప్పిస్తున్నాడు. త్వరలోనే తమ్ము బేబీని పెళ్ళాడి ఒక ఇంటివాడు అవుతాడు అనుకొంటే.. ఆల్రెడీ ఒక ఇంటివాడిని అయ్యాను అంటూ అతని తల్లికి షాకింగ్ న్యూస్ చెప్పాడట విజయ్ వర్మ. తన పాత పెళ్లిఫోటోను విజయ్ వర్మ.. తల్లికి చూపించి షాక్ ఇచ్చాడట.
Rakul Preet Singh : తన పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసిన రకుల్…
ఇంతకీ విజయ్ వర్మ పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ఇంకెవరు మన అలియా భట్. ఏంటి.. జోక్ చేస్తున్నారా..? రణబీర్ కపూర్ ను కదా అలియా వివాహం చేసుకున్నది అని చెప్తారా..? అది నిజమే. అయితే విజయ్ వర్మ, అలియా భట్ వివాహం చేసుకున్నది డార్లింగ్స్ మూవీలో.. అవును.. ఆ సినిమాలో వీరు పెళ్లి చేసుకున్న ఫోటోను సడెన్ గా విజయ్ వాళ్ళ అమ్మకు చూపించి నాకు పెళ్లి అయ్యిపోయిందని చెప్పుకొచ్చాడట. దానికి ఆమె ఫ్రీక్ అయ్యిపోయి.. నిమిషం పాటు గుండె పట్టుకుందట. దీంతో వెంటనే విజయ్ అది ఫ్రాంక్ అని, తన సినిమాలో ఫోటో అని చెప్పి సముదాయించాడట. దీంతో ఆమె శాంతించిందట. ఈ విషయాన్ని విజ్జయి వర్మ లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.