Site icon NTV Telugu

Vijay Devarakonda : కారులోనే శృంగారం చేశా.. విజయ్ షాకింగ్ కామెంట్స్

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కింగ్ డమ్ తో హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా విజయ్ దేవరకొండ గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటించాడు. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ నిర్మాత కరణ్‌ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్‌ ప్రోగ్రామ్ కు అనన్యతో పాటు వెళ్లాడు విజయ్. అందులో కరణ్‌ సెక్స్ గురించి షాకింగ్ ప్రశ్న వేశాడు.

Read Also : Rashmika : బ్రేకప్ అయితే అమ్మాయిలు తట్టుకోలేరు.. రష్మిక కామెంట్స్

నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లో శృంగారం చేశావా అని ప్రశ్నించాడు కరణ్‌. ”అవును” అన్నట్టు విజయ్ దేవరకొండ టిక్ చేశారు. ఎక్కడ? అని కరణ్ జోహార్‌ అడగ్గా.. బోటులో’ చేశా. పబ్లిక్ ప్లేస్ లో అవసరం అనుకుంటే కారులోనే చేశా అంటూ తెలిపాడు విజయ్ దేవరకొండ. నాకు ముగ్గురితో ఒకేసారి శృంగారం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ తెలిపాడు విజయ్. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ అది కేవలం స్క్రిప్ట్ కోసమే అలాంటి కామెంట్ చేశాడని తర్వాత బాలీవుడ్ మీడియా పేర్కొంది. కరణ్‌ తన షోకు పిలిచి అందరినీ ఇలాంటి ప్రశ్నలే వేస్తుంటాడు. చాలా మంది స్క్రిప్ట్ లో భాగంగానే బోల్డ్ ఆన్సర్లు ఇస్తుంటారు.

Read Also : Chiranjeevi : చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. నాగార్జున, వెంకీ హాజరు

Exit mobile version