Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు విభిన్నమైన కథలతో వచ్చి భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్టారమంలోనే లీవుడ్ నుంచి మరో వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా రాబోతోంది. సాధారణంగా మనిషికి గుండె ఎడమ వైపు ఉంటుంది, కానీ ఒకవేళ గుండె కుడి వైపు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కుతున్న సినిమా “చిరంజీవి”. కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
Also Read :Om Shanti Disco Shanti: దెయ్యాలకే చుక్కలు చూపించే పిచ్చోళ్లు!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘డెక్స్ట్రోకార్డియా’ (Dextrocardia) అనే అరుదైన ఆరోగ్య స్థితిని (గుండె కుడి వైపు ఉండటం) కమర్షియల్ ఎలిమెంట్స్‌తో జోడించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులతో పాటు వైవా రాఘవ, శ్రీకాంత్ భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి ఉనికి సినిమాకు మంచి వెయిట్‌ను తీసుకొస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాను ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్ చూస్తుంటే మేకింగ్ వాల్యూస్ బాగున్నాయని, దీప్తి నడిమింటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని అర్థమవుతోంది. కొత్త దర్శకుడైనప్పటికీ, శుభ సాయి వెంకట్ ఈ పాయింట్‌ను హ్యాండిల్ చేసిన తీరు బాగుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తెలుగు మేకర్స్ చేస్తున్న ఇటువంటి ప్రయోగాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. సినిమా టైటిల్ “చిరంజీవి” కావడం, అందులోనూ ఈ విభిన్నమైన కాన్సెప్ట్ ఉండటంతో సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?