Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం విదితమ. ఇప్పటికే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ ను ఫినిష్ చేసిన విజయ్.. త్వరలోనే జనగణమణ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. ఇక లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇక ఈ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ జంట.. కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో విజయ్, అనన్య పాండేల రచ్చ ఎలా ఉందో చూసేసాం. బోల్డ్ ప్రశ్నలు.. అంతకు మించిన బోల్డ్ సమాధానాలతో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఫిదా చేయనుంది.
ఇక ఈ ఎపిసోడ్ లో ఎట్టకేలకు విజయ్ దేవరకొండ తన ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు. “ప్రేమ విషయం అయితే బయటపెట్టాను. కానీ, నేను పెళ్లి చేసుకున్న రోజున మాత్రమే ప్రపంచానికి వెల్లడిస్తాను. తమ అభిమాన హీరో వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిస్తే వారి మనసు ముక్కలవుతుంది. అలా నేను చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే వారు హీరోలను ఇష్టపడతారు.. గోడలపై పోస్టర్లు అతికిస్తారు. ఇలాంటి విషయాన్ని చెప్పి ఇప్పటి నుంచే వారి మనసును ముక్కలు చేయాలనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ ప్రేమించి, పెళ్లాడనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.