Site icon NTV Telugu

Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు

Virosh 2

Virosh 2

విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు గత నెల 26వ తేదీన ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు వారి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే, అదే సమయంలో వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశ వ్యాప్తంగా పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశారు. ఈ విషయం మీద ఒక చిన్నారి రీల్ చేసింది. “మీరు యాక్టర్స్, మేము రిలేషన్స్ (ప్రేక్షకులం) ఉంటాం.. మనం మనం ఒకటే, మమ్మల్ని ఎందుకు పెళ్ళికి పిలవలేదు?” అంటూ క్యూట్ క్యూట్ మాటలతో రీల్ చేయడంతో అది విజయ్ దేవరకొండ దృష్టికి వెళ్లింది.

Also Read:Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్‌ నటించే సినిమా ఏంటి?

“ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి కలుద్దువు గాని” అంటూ ఆమె రీల్ కి అప్పట్లో వారు కామెంట్ చేశారు.
అయితే ఈ విషయం మరిచిపోయి ఉంటారులే అనుకుంటే, ఈరోజు ఏకంగా ఆ చిన్నారిని తమ ఇంటికి పిలిపించుకోవడమే కాదు.. తాను, రష్మిక స్వయంగా వడ్డిస్తూ ఆ చిన్నారిని ఆనందింపజేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి మరోసారి రీల్ చేసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ సినిమాతో పాటు ‘రణబలి’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే రష్మిక కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టింది.

Exit mobile version