Kushi becomes second highest grossing non Tamil movie in 2023: తెలుగులో స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందిన విజయ్ దేవరకొండ తమిళనాట కూడా ఆసక్తికరంగా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ కు విజయ్ దేవరకొండ దగ్గరవుతున్నారు. అందుకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఖుషి” సినిమా తమిళనాట హయ్యెస్ట్ కలెక్టెడ్ నాన్ తమిళ్ మూవీగా నిలవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఖుషి” గతేడాది తమిళనాట 12 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఇక షారుఖ్, నయనతార, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ తర్వాత స్థానం “ఖుషి”నే సంపాదించుకుంది.
Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..
“ఖుషి” తర్వాతి స్థానాల్లో సలార్, యానిమల్ సినిమాలున్నాయని ట్రేడ్ వర్గాల వారు తేల్చారు. ఇక విజయ్ జోడీగా సమంత నటించిన “ఖుషి” సినిమాను దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్స్ లో “ఖుషి” ఒకటిగా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతానికి తనకు గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురాంతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ అంత హడావుడిగా రిలీజ్ చేయడం ఇష్టం లేక వెనకడుగు వేశారు.