Kingdom : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్ జులై 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వరుస ప్రమోషన్లతో జోష్ పెంచేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 26న తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మూవీ టీమ్. ట్రైలర్ తో అమాంతం అంచనాలను పెంచేయాలని చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్ ఆసక్తి పెంచుతున్నాయి.
Read Also : Pawankalyan : వెయ్యి కేజీల పేపర్లు రెడీ చేసిన ఫ్యాన్స్.. థియేటర్లలో ఇక రచ్చే..
ఇందులో విజయ్ లుక్, విజువల్స్, కంటెంట్, లొకేషన్లు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పైగా పాన్ ఇండియా సినిమాగా వస్తోంది. ఇందులో బ్రదర్ సెంటిమెంట్ బలంగా ఉంటుందనే టాక్ ఉంది. గౌతమ్ తిన్నమూరి సినిమాల్లో ఎమోషన్స్ బలంగా ఉంటాయి. ఇందులో కూడా అదే ఫార్ములా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో ఎమోషన్, యాక్షన్, ట్విస్ట్ ఇచ్చే విధంగా కట్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ జులై 31న కచ్చితంగా రిలీజ్ కాబోతోంది. ఓ వైపు థియేటర్లలో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతోంది కాబట్టి.. దాన్ని తట్టుకుని నిలబడేలా మూవీ ప్రమోషన్లు ట్రైలర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?