టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ పై ఓ కంటెంట్ క్రియేటర్ విమర్శలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విమర్శకు మూలం ఈ ఏడాది మేలో విజయ్ చేసిన ఓ కామెంట్. ఆయన హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తన కంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు తీసుకుంటారు, ఎందుకంటే సినిమాలు కూడా అంతే ఎక్కువ బజ్డెట్ తో తెరకెక్కుతాయి అంటూ.. ఎగతాళి చేయడంతో, క్రియేటర్ ఫర్హాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో అప్‌లోడ్ చేశారు. అయితే, విజయ్ లేదా అతని టీమ్ ఒత్తిడి వల్ల ఆ వీడియో తొలగించాల్సి వచ్చింది. దీనిపై ఫర్హాన్ తాజాగా మరోసారి స్పందిస్తూ..
Also Read : Talk show : జగపతి షోలో సందీప్ రెడ్డి vs రామ్ గోపాల్ వర్మ.. పంచ్‌లు, ట్విస్టులు, ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ !
‘ఒక యాక్టర్ నా వీడియోను తీయించారు’ అని కొత్త వీడియో లో వెల్లడించారు. వీడియో లో ఫర్హాన్ విజయ్ పేరు చెప్పకుండా, “ఒక లయన్, టైగర్ కి పిల్ల పుడితే దాన్ని లైగర్ అంటారు” అని పంచ్ ఇచ్చారు. ఇది స్పష్టంగా విజయ్ నటించిన ‘లైగర్’ మూవీని సూచిస్తుంది. తర్వాత, ఫర్హాన్ విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీని సూచిస్తూ “నాకు అర్జున్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఎప్పుడూ టైంకి రెడీగా ఉండడు” అని కామెంట్ చేశారు.
ఫర్హాన్ వివరించినట్లుగా, ఒరిజినల్ వీడియోలో విజయ్ హాలీవుడ్ సినిమాలు ఎక్కువ బడ్జెట్‌తో వచ్చి హిట్ అవుతాయి, అదే కారణంగా యాక్టర్స్ ఎక్కువ డబ్బు తీసుకుంటారని చెప్పిన భాగాన్ని ఎగతాళి చేశారు. ఫర్హాన్ తన వాదన ప్రకారం, తక్కువ బడ్జెట్‌లో వచ్చిన విదేశీ సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయని, కానీ విజయ్ సొంత సినిమాలు పెద్ద బడ్జెట్‌తో వచ్చినప్పటికీ సక్సెస్ కాలేదని చెప్పారు.అంతే కాదు “నేను ఆ వీడియోని మళ్లీ అప్‌లోడ్ చేస్తాను. కొత్త వెర్షన్‌లో తాను యాక్టర్ లా యాక్ట్ చేస్తూ, క్లిప్‌తో పాటు మరోసారి షేర్ చేస్తాను. ఎవరో ఒక ఇంటర్నెట్ యూజర్ విమర్శను కూడా తీసుకోలేని అభద్రతా భావంతో ఉన్నారంటే ఊహించుకోండి” అని తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.