Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న రిలీజ్ కాబోతోంది. దీంతో వరుసగా ప్రమోషన్ల పేరుతో ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విజయ్, సత్యదేవ్ మీద తీసిన ‘అన్న అంటూనే’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బ్రదర్స్ గా విజయ్, సత్యదేవ్ ఎమోషన్ ను చూపించారు. ‘మర్చిపోవడానికి వాడేమన్నా గోడమీద ఉన్న దేవుడా.. నా గుండెల్లో ఉన్న నా అన్న’ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ప్రోమోలో తమ్ముడి కోసం అన్న పడ్డ కష్టాలను చూపించారు. చిన్నతనంలో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చూపించారు.
Read Also : Kota Srinivas : కూతురు అలా.. భార్య ఇలా.. ‘కోట’ జీవితంలో కన్నీటి సునామీ..
మొత్తంగా ఈ సినిమాలో ఈ సెంటిమెంట్ హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హీరో పాత్రకు ఒక సెంటిమెంట్ ఉంటే అది కచ్చితంగా మూవీ ఇమేజ్ ను పెంచుతుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు కింగ్ డమ్ లో కూడా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారంట. ఇక పూర్తి సాంగ్ ను రేపు రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. గౌతమ్ తిన్నమూరి మరోసారి తన మార్క్ ను ఇందులో చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎమోషనల్ సీన్లతో కట్టిపడేయడంలో ఆయన దిట్ట. కాబట్టి ఇందులో అన్నదమ్ముల అనుబంధం హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Kota Srinivas : కోట శ్రీనివాస్ నుంచి నటన నేర్చుకున్నా.. జెనీలియా ఎమోషనల్..
