అభిమానులు రౌడీగా పిలుచుకునే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరిగిపోతుంది. ఆయన హిట్ కొట్టి దాదాపుగా మూడేళ్లు కావస్తున్నా ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉంది. విజయ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పాటు తనదైన శైలితో అభిమానులను ఇట్టే ఆకట్టుకునే ఈ యంగ్ హీరో యూత్ ఐకాన్ గా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు ఫొటోలతో ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తూ ఉంటాడు. సౌత్ నుంచి నార్త్ వరకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాన్ ఇండియా స్టార్లకు సైతం పోటీ ఇస్తున్నాడు. ఇక అసలు విషయంలోకి వస్తే… తాజాగా రౌడీ హీరో ఇన్స్టాలో మరో మైలురాయిని దాటాడు.
Read Also : KGF 2 : ఓటిటిలో ఎప్పుడంటే ?
విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్లు దాటేసింది. ’15M రౌడీస్ ఆన్ ఇన్‌స్టా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రౌడీ టీం. దీంతో విజయ్ అభిమానులు తమ అభిమాన హీరో ఈ ఫీట్ ను సాధించినందుకు సంతోషిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్ సమర్పిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ చిత్రానికి డాషింగ్ ఫిల్మ్ మేకర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న “లైగర్”లో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీని విష్ణు శర్మ నిర్వహిస్తుండగా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా ఫైట్స్‌ను సమకూర్చారు. తన తదుపరి చిత్రం ‘JGM’ని కూడా పూరీ దర్శకత్వంలోనే చేస్తున్నాడు విజయ్.