26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హెప్రదానా పాత్రలో నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ సినిమా జూన్ 3 న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. విడుదల అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డు కలక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమాపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ సైతం ఈ సినిమాపై ప్రసంశలు కురిపించారు.
ఇక తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చాడు. “ఈ సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయి. దేశభక్తి విషయంలో ఆయనను చూసి అందరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతం. తప్పకుండ ఈ సినిమా చూసి మన నిజమైన హీరో గురించి తెలుసుకోండి. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు.నిజంగా ఇలాంటి వీర పుత్రుడిని కన్న మేజర్ సందీప్ తల్లిదండ్రులు గొప్పవారు. వారికి నా హృదయపూర్వక గౌరవం తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ జనగణమణ , ఖుషి సినిమల్లో నటిస్తున్నాడు.
@AdiviSesh @saieemmanjrekar #SobhitaD @SashiTikka @urstrulyMahesh sir @anuragmayreddy @SharathWhat @AplusSMovies @GMBents @sonypicsfilmsin
— Vijay Deverakonda (@TheDeverakonda) June 7, 2022