శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా, ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కాశ్మీర్‌లో జరుగుతోంది. ఇక నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా సామ్ ను విష్ చేశారు. అయితే రౌడీ హీరో మాత్రం ఓ స్వీట్ సర్ప్రైజ్ తో సామ్ ను థ్రిల్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేయగా, అదిప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Read Also : Shah Rukh Khan : బిగ్ రిలీఫ్… ‘రయీస్’ కేసులో కోర్టు తీర్పు ఇదే !
VD11 టీమ్ మొత్తం ఆమెకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసి ఫేక్ సీన్ క్రియేట్ చేసింది. సన్నివేశం చిత్రీకరణ సమయంలో, సామ్ దాదాపు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ సమయంలోనే విజయ్ సడన్ గా సామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇదంతా వీడియోలో సామ్ థ్రిల్ ఫీల్ అవ్వడం కనిపిస్తోంది. ఇక గురువారం సామ్ బర్త్ డే సందర్భంగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ‘శాకుంతలం’ నుంచి లుక్ ను, ఇక ‘యశోద’ నుంచి మార్ అప్డేట్ ను రివీల్ చేశారు.