బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బర్త్డే వేడుకలు గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. బుధవారం రాత్రి ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలో బాలీవుడ్ సామ్రాజ్యంను ఏలుతున్న స్టార్లందరూ హాజరయ్యి హంగామా చేశారు. ఇక ఈ సామ్రాజ్యంలో టాలీవుడ్ లో ఏకైక మొనగాడు విజయ్ దేవరకొండ కింగ్ లా కనిపించాడు. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి విజయ్ కు మాత్రమే ఆహ్వానం అందిందని టాక్ వినిపిస్తుంది. అది కూడా ఎందుకంటే.. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘లైగర్’ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీంతో విజయ్ కు ప్రత్యేక ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఇక ఈ పార్టీ ‘బ్లాక్ అండ్ బ్లింగ్’ థీమ్ లో నడిచింది.
అతిధులు అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ లో మెరిశారు. ఇక పార్టీకి సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా మారాడు మన రౌడీ హీరో. బ్లాక్ అండ బ్లాక్ సూట్ లో రౌడీ హీరో అదరగొట్టేశాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ విజయ్ కు ఫిదా కాకుండా ఉండలేరు అన్నట్లుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నట్లు ప్రచారం సాగింది. కానీ వాళ్లెవ్వరు పార్టీలో కనిపించలేదు. మరి ఆహ్వానం అందిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా బాలీవుడ్ సామ్రాజ్యంలో ఈ రౌడీ హీరో ఎంట్రీ మాత్రం అల్టిమేట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.