Vijay Devarakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. VD12, VD 13 సినిమాలు లైన్లో ఉన్నాయి. VD 12 కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. VD13 కు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రెండు రోజుల క్రితమే ఈ సినిమా కూడా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పరుశురామ్- విజయ్ కాంబోలో గీతగోవిందం లాంటి హిట్ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hanuman: మేము రిస్క్ చేయడం లేదు.. ‘హనుమాన్’ సినిమాపై ప్రశాంత్ వర్మ క్లారిటీ
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఒక క్లాస్ టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. అదే ” ఫ్యామిలీ స్టార్”. లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందంట . అందుకే ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మేరీ ఇందులో నిజం ఎంత అనేది తెలియాలి. ఇప్పటివరకు విజయ్.. రౌడీ హీరో గా పాపులర్ అయ్యాడు.. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా మారిపోతాడేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఈ సినిమాతో గీత గోవిందం రిజల్ట్ రీపీట్ అవుతుందా..? లేదా..? అనేది చూడాలి.