Anupama Counter to Bold Role Comments in Tillu Square: త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత చేసిన శతమానం భవతి సినిమాతో ఒక మంచి హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. దాదాపుగా అదే ఇమేజ్ నిన్న మొన్నటి వరకు కాపాడుకుంటూ వచ్చింది అయితే ప్రస్తుతం ఆమె టిల్లు స్క్వేర్ అనే సినిమాలో నటిస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకి ఈ టిల్లు స్క్వేర్ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మార్చి 29వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో సినిమా యూనిట్ మాట్లాడింది ఈ మాట్లాడుతున్న సమయంలో అనుపమ ఈ సినిమా కోసం ఒక బోల్డ్ పాత్రలో ఎందుకు నటించింది అనే విషయం మీద చాలా మంది జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు వచ్చాయి.
Premikudu : ప్రేమికులారా గెట్ రెడీ.. ప్రేమికుడు మళ్ళీ వస్తున్నాడు!
అయితే వీటన్నింటికీ ఒక్కసారి అనుపమ గట్టి కౌంటర్ లాంటి సమాధానం ఇచ్చింది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు రెగ్యులర్గా వేసుకునే బట్టలు కాకుండా కాస్త కొత్తగా అనిపించే బట్టలు వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మనకు ఏమి నచ్చుతుందో తెలుస్తుంది. అలాగే నేను ఇన్ని సంవత్సరాలు రెగ్యులర్గా ఒకే రకమైన పాత్రలు చేస్తూ వచ్చాను, అవి ఇన్నాళ్లుగా చూసిన మీకు బోర్ కొడుతుంది. నాకు కూడా అలాగే బోర్ కొట్టింది ఆ సమయంలో నాకు ఈ సినిమా నుంచి అవకాశం వచ్చింది, ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాలో లిల్లీ అనే పాత్ర విన్న తరువాత దీన్ని దూరం చేసుకుంటే నా కన్నా స్టుపిడ్ ఉండరు అనిపించింది. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో ఒక అమ్మాయికి ఇంత మంచి పాత్ర దొరకడం చాలా కష్టం. కావాలంటే మీరు రాసుకోండి నేను చెబుతున్నాను అని చెప్పుకొచ్చింది. మీకు బిర్యానీ అంటే ఇష్టమని ప్రతిరోజు బిర్యానీ తినలేం కదా. అలాగే నాకు కూడా బిర్యానీ అంటే ఇష్టమే కానీ నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినలేను, వేరువేరుగా పలావులు కావాలి, పులిహోరలు కావాలి అనిపిస్తుంది కదా అలాగే ఈ పాత్ర కూడా అంటూ ఆమె చెప్పుకొచ్చింది.