Vijay Babu: హీరోయిన్ పై అత్యాచారం.. దుబాయ్ పారిపోయిన హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుకు నటి అత్యాచార కేసు మెడకు చుట్టుకొని వదిలేలా కనిపించడం లేదు. కోర్టులో అతడు పెట్టిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను నాయస్థానం కొట్టిపారేసింది. దీంతో అతను ఖచ్చితంగా కోర్టులో హాజరు కాక తప్పదు.. ఒకవేళ హాజరు కానీ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ప్రస్తుతం విజయ్ బాబు దుబాయ్ లో తలా దాచుకున్నాడని, అందుకే అతను కోర్టుకు హాజరుకాలేకపోయాడని అతని తరుపు న్యాయవాది చెప్పినా న్యాయస్థానం వెంటనే అతడిని కొచ్చికి వచ్చి కోర్టులో హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో విజయూ బాబు రేపు అనగా బుధవారం కొచ్చిలొకి దిగుతాడని, వెంటనే అక్కడినుంచి కోర్టులో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మే 30న కేరళకు తిరిగి రాకుంటే అతని పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోబోమని ఇప్పటికే స్పష్టం చేసిన కోర్టు బుధవారం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ సాగుతోంది.
కోజికోడ్ కు చెందిన నటి ఏప్రిల్ 22న కొచ్చిలోని ఒక ఫ్లాట్ లో ప్రముఖ నటుడు నిర్మాత విజయ్ బాబు తనపై అత్యాచారం చేశాడని నటి ఎర్నాకులంలోని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అవకాశం ఇస్తానని చెప్పి తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, తనను లైంగికంగా వేధించే ముందు తనకు మత్తు పదార్థాలు ఇచ్చాడని కూడా ఆమె ఆరోపించింది.ఇక ఈ వార్త బయటికి వచ్చి సంచలనంగా మారిన సమయంలో విజయ్ తన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని., ఆమె కావాలనే ఇదంతా చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు విమర్శలు గుప్పించారు తప్పేమి లేకపోతె కోర్టులో సరెండర్ అయ్యి పోరాటం చేయొచ్చు కదా.. అని కామెంట్స్ పెట్టారు. ఇక ఇలా నడుస్తున్న క్రమంలో ఎవరికి తెలియకుండా గత నెలలో విజయ్ బాబు దుబాయ్ పారిపోయాడు. ఇక అక్కడి నుంచి జార్జియా వెళ్ళాడు. ఇలా విదేశాలు తిరుగున్న విజయబాబును మళ్లీ దుబాయ్ రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. జార్జియా నుంచి దుబాయ్ వెళ్లి అక్కడ పోలీసులకు సరెండర్ అయ్యి.. అక్కడినుంచి కొచ్చి కి బాబు రావాల్సి ఉంది.. మరి ఈ కేసులో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!