Vignesh Shivan: బేబీపై మనసు పడ్డ నయనతార భర్త.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vignesh Shivan: సినిమాలో విషయం ఉంటే.. ఎక్కడైనా.. ఏ భాషలోనైనా హిట్ అందుకుంటుంది. అందులో స్టార్ క్యాస్ట్ ఉండాల్సిన అవసరం లేదు.. స్టార్ డైరెక్టర్ తీయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సినిమాలే ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్లుగా మారుతున్నాయి. తాజాగా టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసిన సినిమా బేబీ. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అబ్బాయిలను అమ్మాయిలు ఎలా మోసం చేస్తున్నారు అనే కథతో తెరకెక్కిన ఈ సినిమాకు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. హీరోల ప్లేస్ ల్లో తమను తాము ఊహించేసుకొని తమ మాజీ ప్రియురాళ్లను తిట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా కేవలం అభిమానులనే కాదు సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు సినిమాను ప్రశంసిస్తూ చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు. ఇక బేబీ రేంజ్.. రోజు రోజుకు పెరిగిపోతోంది. తెలుగే కాకుండా తమిళ్ లో కూడా తన సత్తా చూపిస్తోంది. తాజాగా బేబీ మూవీపై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Bhola Shankar Trailer: చిరు నట విశ్వరూపం..
Also Read
- Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్.. నయనతార వివాహం చేసుకొని .. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం కొత్త జీవితాన్నీ మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. మంచి సినిమా ఏదైనా సరే భాషా బేధం లేకుండా విగ్నేష్ ప్రశంసిస్తూ ఉంటాడు. తాజాగా బేబీ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ” న్యూ బోల్డ్ టీమ్ నుంచి వచ్చిన ఈ న్యూ ఏజ్ సినిమా క్రేజీగా రికార్డులు బద్దలుకొడుతుంది.చిత్రబృందానికి కుడోస్. బోల్డ్ గా రాసి.. బ్రూటల్ గా చిత్రీకరించారు” అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే విగ్నేష్ బేబీపై మనసు పడినట్లు ఈ కామెంట్స్ చూస్తుంటేనే తెలుస్తోంది. దీంతో బేబీ తమిళ్ లో రీమేక్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి విగ్నేష్ అలాంటి పనిచేస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!