బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌తో వివాహమైనప్పటి నుండి విక్కీ కౌశల్ పేరు ఏదో ఒక విధంగా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక తన అభిమానులను అలరించడానికి ఈ హీరో తన ఫన్నీ క్లిప్‌లు, వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నాడు. అయితే ఆదివారం మాత్రం ఓ వింత జరిగింది. టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో విక్కీ కౌశల్ పేరు కన్పించింది. విక్కీ అభిమానులు టీమ్ ఇండియాతో ఆయన పేరును స్పామ్ చేశారు.
Read Also : ఆయనకు మ్యూజిక్ అక్కర్లేదు… స్టార్ సింగర్ పై బన్నీ కామెంట్స్
ఆదివారం భారత U19 క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో ఆడింది. ఆన్‌లైన్‌లో స్కోర్‌బోర్డ్‌ను ఫ్లాష్ చేస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా విక్కీ కౌశల్ పేరు తెరపైకి వచ్చింది. ఇది వీక్షకుల దృష్టిని ఆకర్షించిన వెంటనే వారు ఉల్లాసకరమైన పోటితో విక్కీని స్పామ్ చేయడం ప్రారంభించారు. దానికి సమాధానంగా విక్కీ “ఈ రోజు నన్ను స్పామ్ చేసినందుకు ఇంటర్నెట్‌కి ధన్యవాదాలు. టీమ్ ఇండియా U19కి శుభాకాంక్షలు” అంటూ ఆ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశాడు.

ఇక విక్కీ కౌశల్ సినిమాల విషయానికొస్తే… జనవరి 27న సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ తమ నెక్స్ట్ సినిమా షూటింగ్‌ను ముగించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.