మనసు కవి… మన సుకవి… ఆత్రేయ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 13న ఆచార్య ఆత్రేయ వర్ధంతి)
“మనను మూగదే కానీ… బాసుండది దానికి…” అంటూ మనసు భాషను పాటలో పలికించిన ఘనుడు ఆచార్య ఆత్రేయ. “మనసు గతి ఇంతే… ” అంటూ మనసు స్థితిని వివరించిన ధీశాలి ఆయన. “మౌనమే నీ భాష ఓ మూగ మనసా…” అంటూ మనసు ఏ పరిస్థితుల్లో ఎలాంటి భాష పలుకుతుందో కనుగొన్న పరిశోధకుడు మన ఆత్రేయ. అందుకే సమకాలిక కవులు ఆత్రేయను ‘మనసు కవి’ అన్నారు, అంతేనా ‘మన సుకవి’ అనీ కీర్తించారు. ‘మనసు’పై ఎందరో కవులు, సినీ గీతరచయితలు పాటలు రాసినా, ‘మనసు’ అన్న పదాన్ని తన హక్కుగా గైకొని ఆత్రేయలా ఉపయోగించుకున్న గీతరచయిత మరొకరు కానరారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. 1921 మే 7న నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట సమీపంలోని మంగళం పాడు గ్రామంలో జన్మించారు ఆత్రేయ. చదువుకొనే రోజుల్లోనే ఆదర్శ భావాలు పలికిస్తూ పాటలు, నాటకాలు రాసి అలరించారు. ‘క్విట్ ఇండియా ఉద్యమం’లో పాల్గొనడానికి చదువును వదిలేశారు. జైలుకు వెళ్ళారు. విడుదలై వచ్చాక ‘జమీన్ రైతు’ పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. ఆత్రేయ కలం నుండి జాలువారిన పలు నాటికలు, నాటకాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో “భయం, విశ్వశాంతి, కప్పలు, గౌతమబుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తనం, ఎదురీత, ఎన్జీవో” వంటివి విశేషాదరణ చూరగొన్నాయి. నాటకాల్లో ఆయన పలికించే పదాలు విని అనేక సినిమా జీవులు మురిసిపోయేవారు. ఆయన గురించి గోపీచంద్ ద్వారా తెలుసుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకులు కె.ఎస్. ప్రకాశరావు తన ‘దీక్ష’ చిత్రం ద్వారా ఆత్రేయను చిత్రసీమకు పరిచయం చేశారు. ‘దీక్ష’లో ఆత్రేయ రాసిన తొలి పాట “పోరా బాబూ…పోయి చూడు లోకం పోకడ…” ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకుంది. ఆరంభంలో కొందరు ఆత్రేయతో కేవలం మాటలే రాయించుకున్నారు. కొందరు అడపాదడపా పాటలు రాసే అవకాశం కల్పించారు. ఏది రాసినా, అందులో తనదైన బాణీ పలికించేవారు ఆత్రేయ. అన్నపూర్ణ వారి ‘తోడికోడళ్ళు’లో ఆత్రేయ రాసిన “కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడిచానా…” పాట ఆ రోజుల్లో యువకులను ఎంతగానో మురిపించింది. అలాగే ‘ముందడుగు’లోని “కోడెకారు చిన్నవాడా… వాడిపోని వన్నెకాడా…” సాంగ్ మరింతగా అలరించింది. ఇలా పాటలు రాసుకుంటూ, మాటలు పలికిస్తూ ఆత్రేయ చిత్రప్రయాణం సాగింది.
‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో ఆత్రేయ రాసిన మాటలు, ఆయన కలం పలికించిన “శేషశైలా వాసా…” పాట జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా ఘనవిజయం తరువాత ఆత్రేయ గీతరచన కూడా ఊపందుకుంది. ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయను బాగా ప్రోత్సహించారు. ఆదుర్తి చిత్రాలకు ఆత్రేయ రాసిన అనేక పాటలు పండితపామరులను రంజింప చేశాయి. కొన్ని చిత్రాలలో మాటలు-పాటలు రెండూ ఆత్రేయనే పలికించేవారు. అలా కూడా అనేక చిత్రాలు జనం మదిని దోచాయి. జగపతి ఆర్ట్ పిక్చర్స్, సురేశ్ ప్రొడక్షన్స్, యువచిత్ర వంటి నిర్మాణ సంస్థలు ఆత్రేయను తమ ఆస్థాన కవిగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆత్రేయ పాటలు లేకుండా సినిమాలు తీయలేమనీ కొందరు నిర్మాతలు అనేవారు. అలాగే ఆత్రేయ కన్నుమూసిన తరువాత వారు మాటపై నిల్చున్నారు. అంతలా అభిమానం సంపాదించారు ఆత్రేయ. ఆయన గీతరచనలో చివరగా వెలుగు చూసిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. 1989 సెప్టెంబర్ 13న ఆచార్య ఆత్రేయ తుదిశ్వాస విడిచారు. ఎందరో భావి సినీగేయరచయితలకు ఆయన పాటే శ్వాసగా మారి బాట చూపింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!