SK Bhagavan: ఇండస్ట్రీలో వరుస మరణాలు ప్రేక్షకులను భయాందోళలకు గురిచేస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు మృతిచెంది ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చారు. ఇక రెండు రోజుల క్రితం తారకరత్న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన అంత్యక్రియలు ఇంకా పూర్తికాకముందే మరో స్టార్ డైరెక్టర్ మృతి చెందడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కన్నడ స్టార్ డైరెక్టర్ ఎస్ కె. భగవాన్ నేటి ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం బెంగుళూరులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా కన్నడ నాట విషాదం నెలకొంది
ఎస్ కె. భగవాన్ వయస్సు 90. ఆయన కెరీర్ లో చాలావరకు ప్లాప్స్ లేవు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు అందుకోవడమే కాదు. కంఠీరవ రాజ్ కుమార్ తో ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టర్ గా భగవాన్ కు మంచి గుర్తింపు ఉంది.
OMG: తారకరత్నతో దోబూచులాడిన 9 సంఖ్య!
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన తన స్నేహితుడు దొరై రాజు తో 27 సినిమాలు తీసాడు. ఆ సినిమాలన్నీ దాదాపుగా హిట్ టాక్ తెచ్చుకోవడంతో వీరిద్దరి పేర్లు కన్నడ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయాయి. ఇక భగవాన్ మృతి పట్లు పలువురు సినీ రాజకీయ నేతలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై భగవాన్ మృతి పట్లసంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు శ్రీ ఎస్. కె. భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. దొరై-భగవాన్ జంట కన్నడ సినిమాకు ఎన్నో మంచి సినిమాలను అందించింది” అంటూ ట్వీట్ చేశారు.