Dhanush : కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. ఇది ఒకింత నిజమే. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోల సినిమాలు అంటే కత్తి పట్టి నరకాల్సిందే.. రక్తం ఏరులై స్క్రీన్ నిండా పారాల్సిందే అన్నట్టే ఉంటాయి. హీరోయిజాన్ని చూపించే సినిమాలే తప్ప ఒక బిచ్చగాడిగా నటించే పాత్రల్లో మన వాళ్లు అస్సలు నటించరు. వాళ్లు ఒక మెట్టు కిందకు దిగి నటించాల్సి వస్తే ఆ సినిమానే రిజెక్ట్ చేస్తారు.
Read Also : War2- coolie : 50 డేస్ కౌంట్ డౌన్.. ఏంటీ కొత్త ట్రెండ్..
వంగి దండాలు పెట్టే పాత్రలు, బానిసగా చేసే పాత్రలు, కుల వివక్ష పాత్రల్లో అస్సలు నటించరు. ఇలాంటి పాత్రలు చేయడం ధనుష్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ధనుష్ లాగానే టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీగా ఉండే హీరో ఒక్కడున్నాడు. ఆయనే విక్టరీ వెంకటేశ్. ఆయన సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. హీరోయిక్ పాత్రలు చేయడం కంటే కంటెంట్ ఉండి, నటనకు స్కోప్ ఉన్న పాత్రలే వెంకటేశ్ చేస్తాడు. ధనుష్ చేసిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేశాడు వెంకీ.
ఈ సినిమాలో ఎంత కులవివక్షకు గురైన పాత్రలో నటిస్తాడో చూశాం. చివరకు ఇళ్ల ముందు పొర్లుదండాలు పెట్టి క్షమాపణ అడిగే సీన్ ను అలాగే ఉంచి నటించాడు వెంకీ. అంతకు ముందు దృశ్యం సినిమాలో ఓ కానిస్టేబుల్ చేతుల్లో తన్నులు తింటాడు. ఆ సీన్ లో కానిస్టేబుల్ వెంకీ ముఖం మీద తన్నే సీన్ కూడా ఉంటుంది. అలాంటి సీన్ చేయాలంటే మన స్టార్ హీరోలు అస్సలు ఒప్పుకోరు. కానీ వెంకీ మాత్రమే ఒప్పుకున్నాడు. ఇవే కాదు గతంలో ఇలాంటి ఎన్నో పాత్రలు చేసి వాటికి ప్రాణం పోశాడు వెంకీ. ఒక బిచ్చగాడిగా నటించకపోవచ్చు గానీ.. అలాంటి పాత్ర పడితే నటించేందుకు వెంకీ ముందు ఉంటాడని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
Read Also : Kubera : కుబేరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. నిజమేనా..?
