Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ భలే క్రేజ్ ఉంటుంది, ఇప్పుడు ఆ క్రేజ్‌ను రెట్టింపు చేస్తూ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుంది, ప్రేక్షకులను నవ్వించడంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీస్టారర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నెల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత ఎక్కడా బ్రేకులు లేకుండా, రాకెట్ వేగంతో షెడ్యూల్స్ కంప్లీట్ చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా ప్లానింగ్ చేసుకున్నారట, ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ఈ కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఆయన ట్యూన్స్ ఈ నవ్వుల పండగకు మరింత జోష్ తీసుకురానున్నాయి. పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో దించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పండగ సీజన్‌కు ఇలాంటి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ వస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం ఖాయం. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనిల్ రావిపూడి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ దశలోనే ఫన్ బీభత్సంగా పండిందని.. ఆ పేపర్ మీద ఉన్నది యాజ్ ఇట్ ఈజ్‌గా స్క్రీన్ పైకి వస్తే చాలు, థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వుల సునామీ ఖాయమని ఇన్‌సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. వెంకీ మార్క్ కామెడీ టైమింగ్, కల్యాణ్ రామ్ ఎనర్జీని అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఎలా వాడుకుంటారో చూడాలి. ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?