Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇక నేడు విక్టరీ వెంకటేశ్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. వెంకీకి చిరంజీవి స్పెషల్ వెల్ కమ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో వెంకీ 90స్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడంట. చాలా గ్లామరస్ ఫేస్ కట్ తో.. కొంచెం యంగ్ గానే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ ఫ్యాన్స్ చూడాల్సిందే
వెంకీ పాత్రను చాలా క్రేజీగా డిజైన్ చేశాడంట అనిల్ రావిపూడి. ఆ పాత్రను వెంకీ మాత్రమే చేయగలడు అనేలా ఉంటుందంట. అందుకే వెంకీని చిరు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. చిరు, వెంకీ కలయికలో మూవీ రావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందని ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు పెట్టేసుకుంటున్నారు. అసలే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ప్లాప్ అనేది లేదు కదా. అందుకే ఈ సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందేమో అని కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.
Read Also : Ram Charan – Upasana : ఉపాసనకు ట్విన్స్.. మెగా ఇంట్లో డబుల్ ధమాకా..
