Waltair Veerayya: మూడు దశాబ్దాలు అయినా బాసులో గ్రేసు తగ్గలేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోల ఫాన్స్ దర్శకులుగా మారి తమ ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప. ‘గబ్బర్ సింగ్’, ‘విక్రమ్’, ‘పేట’ సినిమాలని ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే రేంజులో డైరెక్ట్ చేశారు ఆ సినిమా దర్శకులు. ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ నే మెగా అభిమానులకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు బాబీ. ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ మెగా అభిమానులకి ఎలాంటి సాంగ్స్ కావాలో సరిగ్గా అదే టెంపోలో రెండు సాంగ్స్ ఇచ్చాడు కానీ ఇతర హీరోల అభిమానులకి కూడా సరిపోయే రేంజ్ సాంగ్ ఇంకా బయటకి రాలేదు. అలాంటి పాటనే ఇప్పుడు బయటకి వదులుతున్నాం అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
Read Also: Chiru Balayya: 2017 హిస్టరీ రిపీట్ అవుద్దీ…
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
‘వీరయ్య టైటిల్ సాంగ్’ ని డిసెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశారు, ఈ ట్వీట్ లో ఉన్న పోస్టర్ ఇప్పుడు మెగా అభిమానులకి గూస్ బంప్స్ ఇస్తుంది. చిరంజీవి గ్యాస్ లైటర్ పట్టుకున్న స్టిల్ లో వింటేజ్ చిరుని గుర్తు చేశాడు. 1991లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో చిరు గ్యాస్ లైటర్ ని పట్టుకోని కనిపిస్తాడు. అప్పట్లో మాస్ అనే పదానికే బెంచ్ మార్క్ లా ఉండే ఆ స్టిల్ ని ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చూపించబోతున్నాడు బాబీ. ఈ వింటేజ్ వైబ్స్ ఉన్న పోస్టర్ ని చూడగానే ‘మూడు దశాబ్దాలు దాటినా బాసులో ఇంకా గ్రేసు తగ్గలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పోస్టర్ తోనే గూస్ బంప్స్ ఇచ్చిన బాబీ అండ్ టీం డిసెంబర్ 26న ‘వీరయ్య టైటిల్ సాంగ్’తో ఇంకెలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Get ready to witness Mass Moolavirat's Vishwaroopam 😎🔥
3rd single #VeerayyaTitleSong from #WaltairVeerayya out on 26th Dec 🔥💣#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/HDxnqHJpyk— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2022
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!