Chiru: ‘వాల్తేరు వీరయ్య’లో రెండు ఐకానిక్ సీన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత సరైన మాస్ సినిమా చెయ్యలేదు. పొలిటికల్, సోషల్ మెసేజ్, పీరియాడిక్ డ్రామా… ఇలా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్స్ లో చిరు సినిమాలు చేస్తున్నాడు. చిరు ప్రయోగాలు చేస్తుండడంతో మెగా అభిమానులు, ఆయనలోని మాస్ ని మిస్ అవుతున్నారు. అన్నయ్య మాస్ సినిమా చెయ్ అంటూ సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు. ఒక అభిమాని బాధ ఇంకో అభిమానికే అర్ధం అవుతుంది కదా అందుకే దర్శకుడు బాబీ రంగంలోకి దిగాడు. చిరుని మాస్ అవతారంలోకి తెస్తూ, బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజ క్యామియో ప్లే చేస్తున్న ఈ మూవీలో చిరు మాస్ మూల విరాట్ గా కనిపించనున్నాడు.
‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన పోస్టర్స్, గ్లిమ్ప్స్ లో చిరు లుంగీ కట్టి ఊరమాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. మెగా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేలా ‘వాల్తేరు వీరయ్య’ని డిజైన్ చేస్తున్న బాబీ, ఈ మూవీలో రెండు ఐకానిక్ సీన్స్ ని పెట్టాడట. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి మరింత కిక్ ఇచ్చేలా ఆ ‘రెండు సీన్స్’ని బాబీ స్పెషల్ కేర్ తీసుకోని రూపొందించాడని సమాచారం. రెండు ఐకానిక్ సీన్స్ లో ఒకటి, ‘ముఠామేస్త్రి సినిమాలోని ఈ పేటకి నేనే మేస్త్రీ’ సాంగ్ లోని డాన్స్ స్టెప్… ఇంకొకటి ‘ఖైదీ’ సినిమాలోని పోలిస్ స్టేషన్ సీన్. మెగా అభిమానులకే కాదు యావత్ సినీ అభిమానులకే, ఈ రెండు సీన్స్ అంటే చాలా ఇష్టం. ‘ఖైదీ’ సినిమాలోని పోలిస్ స్టేషన్ సీన్, చిరుని మాస్ హీరోగా నిలబెడితే… ‘ముఠామేస్త్రి స్టెప్’ దాదాపు దశాబ్దం పాటు ప్రతి స్టేజ్ పైనా కనిపించింది. అందుకే అవి ఐకానిక్ మూమెంట్స్ అయ్యాయి. ఇలాంటి రెండు సీన్స్ ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో పెట్టి మెగా అభిమానుల్లో జోష్ నింపాలి అనేది బాబీ ప్లాన్. ఒకప్పటి చిరుని గుర్తు తెస్తే చాలు, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని చూడడానికి మెగా అభిమానులే కాదు సినీ ప్రేక్షకులంతా థియేటర్ కి వెళ్తారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!