కన్నడ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రవి బస్రూర్. రవి బస్రూర్ అంటే చాలా మందికి కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఓ ఇన్నర్ టాలెంట్ ఉంది. అదే ఫిల్మ్ మేకింగ్. దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలను తెరకెక్కించిన రవి బస్రూర్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను డైరెక్ట్ చేసాడు.
Also Read : Mollywood : కాంట్రవర్సీ.. కేరాఫ్ ‘కేరళ సినిమా’ ఇండస్ట్రీ
ఇప్పటి వరకు గార్గర్ మండల, బిలిందర్, కటక, గిర్మిత్, కాదల్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తన 12 ఏళ్ల కలను నిజం చేసుకున్నాడు. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మక హిస్టారికల్ డ్రామా ‘వీర చంద్రహాస’ సినిమాను డైరెక్ట్ చేసాడు. కుంతల రాజ్యానికి చెందిన కథను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో తెరకెక్కించిన వీర చంద్రహాస ఏప్రిల్ 18న విడుదల కాగా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇది అత్యున్నత స్థాయి మేకింగ్‌తో కూడిన దృశ్య కావ్యమని, కన్నడ సినిమాకు గర్వకారణమైన సినిమా వంటిదని ప్రేక్షకులు ఈ సినిమాను కీర్తిస్తున్నారు. యక్షగాన ఆధారంగా నిజమైన యక్షగాన కళాకారుల గురించి తెలియజేసిన సినిమా అని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. కన్నడ బడా నిర్మాణ సంస్థ హోంబేలె ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించింది. ఓ వైపు కంపోజర్‌గా మరో వైపు డైరెక్టర్‌గా బిజీగా ఉన్న రవి బస్రూర్ ఫిల్మ్ మేకర్‌గా వీర చంద్రహాస తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనే చెప్పాలి.