Veekshanam Trailer: సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా కంటెంట్ ఉన్నదా లేదా అనే విషయం మీద మాత్రమే తెలుగు ప్రేక్షకులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే భిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కోవలో రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టింది సినిమా యూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్.
Eeswar Re-Release Trailer: ప్రభాస్ ‘ఈశ్వర్’ రీ రిలీజ్ .. ట్రైలర్ అదిరిందే!
ట్రైలర్ పరిశీలిస్తే ఇది ఒక హారర్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లర్ మూవీలా అనిపిస్తోంది. 8 నెలల క్రితమే చనిపోయిన ఒక అమ్మాయితో హీరో ప్రేమలో పడటం ఆ అమ్మాయి హీరో స్నేహితులకు కూడా కనిపిస్తూ ఉండడం సినిమా మీద ఆసక్తి పెంచేస్తోంది. ఇక ట్రైలర్ కట్ మొత్తం చూస్తే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు గ్లామర్ కూడా గట్టిగానే కనిపిస్తోంది.