VarunTej: ఈ జనరేషన్‌లో కామెడీ ఫిలిం తీయాలంటే ఒక్కడికే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శిల్పకళావేదికలో F3 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. యాంకర్ సుమ ఏదైనా షోకు హోస్ట్ చేస్తే అదిరిపోతుందని ఆమెను వరుణ్ తేజ్ ఆకాశానికి ఎత్తేశాడు. F3 సినిమాతో తమకు రెండు సమ్మర్‌లు అయిపోయాయని.. 2020, 2021 సమ్మర్లు గడిచిపోయాయని.. ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వరుణ్ తేజ్ అన్నాడు. తెలుగులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా రోజులు అయిపోయిందని.. కుటుంబసభ్యులతో చూసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటించారని.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సినిమాలో దగా ఫ్యామిలీతో కలిసి నటించినట్లు వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.
మరోవైపు F3 సినిమాతో పాత సునీల్‌ను చూస్తారని వరుణ్ తేజ్ అన్నాడు. ఈ సినిమాలో సునీల్, తాను మామా అల్లుళ్లుగా నటించామన్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారని.. బీజీఎం కూడా బాగుంటుందని వరుణ్ తెలిపాడు. ఇందాక దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ గారికి ఐలవ్‌యూ చెప్పారని.. తాను అనిల్‌కు చెప్తున్నానని పేర్కొన్నారు. అనిల్ లాంటి పాజిటివ్ పర్సన్‌ను తాను చూడలేదని.. తన చుట్టూ ఉన్నవాళ్లను అనిల్ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడని వరుణ్ వెల్లడించాడు. ప్రేక్షకులనే కాదు తమను కూడా నవ్విస్తూ ఉంటారని.. ఈ జనరేషన్‌లో కామెడీ సినిమాను అనిల్ కంటే బాగా ఎవరూ తీయలేరని వరుణ్ అభిప్రాయపడ్డాడు. F3 మూవీ అనిల్‌కు చాలా మంచి పేరు తీసుకొస్తుందని ఆకాంక్షించాడు.
Also Read
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
విక్టరీ వెంకటేష్‌తో చాలా మంది హీరోలు మల్టీస్టారర్లు చేశారని.. ఆయనతో రెండో సారి నటించే అవకాశం తనకు మాత్రమే దక్కిందని వరుణ్ వెల్లడించాడు. దిల్ రాజు బ్యానర్‌లో తనకు ఇది హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని వరుణ్ అన్నాడు. గతంలో ఫిదా, F2 సినిమాలు చేశానని.. అవి బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయని.. ఇప్పుడు F3తో మరోసారి విజయం అందుకుంటానన్న నమ్మకం ఉందని తెలిపాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని.. ఈనెల 27న కాకుండా మళ్లీ సక్సెస్ మీట్‌లో మాట్లాడతానని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?