మెగా కుటుంబం లో వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు.. మెగా కోడలు ఉపాసన కడుపుతో ఉన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలిలో గుడ్ న్యూస్ లు వింటున్నాము.. ఇక రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆచార్య సినిమాలో జంటగా నటించారు. అంతే కాకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఫిక్స్ అయింది.. ఇలా వరుస మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్ లను వింటున్నారు.. ప్రస్తుతం మెగా రామ్ చరణ్ దంపతులకు పాప పుట్టింది.. సినీ ప్రముఖులు , అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య ల ఎంగేజ్మెంట్ ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఇక పెళ్లి డేట్ కూడా త్వరలోనే ఉంటుంది అని వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే పెళ్లికి సంబంధించిన షాపింగ్ మొత్తం పూర్తి చేయడానికి వీళ్ళిద్దరూ విదేశాల లో షాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఆ మధ్య వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..
అందుకే రామ్ చరణ్ కు కూతురు పుట్టినా కూడా ఈ ఇద్దరు హాస్పిటల్ కి రాలేకపోయారు. అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ఇద్దరు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు అభిమానులకు అందరికీ రిసెప్షన్ పార్టీ మాత్రం గ్రాండ్ గా హైదరాబాదులోనే ఇస్తున్నట్లు సమాచారం.. మరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం వరుణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..