మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఎక్కువ ఎక్స్పరిమెంట్స్ చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కంచే, అంతరిక్షం, గద్దలకొండ గణేష్, అల్లాదిన్ (వాయిస్ ఓవర్)… సినిమా ఏదైనా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన వరకూ 100% ఎఫోర్ట్స్ పెట్టే వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలని చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇంకో సినిమాని మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. గతంలో రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read Also: Bholaa: అందుకే అన్నింట్లో వేలు పెట్టకూడదు అంటారు…
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ‘మానుషీ చిల్లర్’ నటిస్తుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘VT 13 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ గ్వాలియర్ లో జరిగింది. గ్వాలియర్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది అంటూ వరుణ్ తేజ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో ఒక ఫోటోని కూడా వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో వరుణ్ రియల్ లైఫ్ ఫైటర్ జెట్ పైలట్ అనిపించేలా ఉన్నాడు. ఫేస్ ఫుల్ గా రివీల్ చెయ్యలేదు కానీ సైడ్ ప్రొఫైల్ లో వరుబ్ తేజ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. మరి చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ప్రిన్స్ కి ‘VT 13’ ఆ లోటుని తీరుస్తుందేమో చూడాలి.
Wrapped a kickass schedule for #VT13 in Gwalior!🎬
Now back to base. pic.twitter.com/NyNDIQjdtp
— Varun Tej Konidela (@IAmVarunTej) April 6, 2023