Varun Tej Comments at Operation Valentine Promotions in Vishakapatam: వరుణ్ తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నిజానికి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడి మార్చి 1 న రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు ఏపీలో పర్యటిస్తున్నారు సినిమా యూనిట్. ఈరోజు విశాఖలో ఆపరేషన్ వాలంటైన్స్ మూవీ టీం సందడి చేసింది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో వరుణ్ తేజ్ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 14 జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలతో వస్తున్న సినిమా ఇది, తెలుగులో ఎయిర్ ఫోర్స్ మీద వస్తున్న మొదటి సినిమా ఇది అని అన్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఒకేరోజున ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుందని, దేశ భక్తితో జవాన్ లకు ఇస్తున్న ఒక ట్రిబ్యూట్ సినిమా ఇది అన్నారు.
దేశ సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొనే వాస్తవ సవాళ్ళను ప్రజలకు తెలియజేయడానికి ఈ సినిమా ద్వారా చేస్తున్న ప్రయత్నం అని, మంచి సినిమాను ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. మా సినిమా దేశంలో ప్రతీ ఒక్క దేశభక్తుడు కి కనెక్ట్ అవుతుందని, ఇది తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది భావిస్తున్నానని అన్నారు. ఇక పొలిటికల్ అంశాల గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నామని, ఇప్పుడు కూడా ఇంట్లో పెద్దలు ఏం చెప్తే అదే చేస్తామని అన్నారు. ఇక పెద్దవారు ప్రచారం చేయమంటే చేయడానికి సిద్ధమని పేర్కొన్న ఆయన మా పవన్ బాబాయ్ కి 100% సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు.