Geethu Royal Comments on Shanmukh Brother issue: విశాఖపట్నానికి చెందిన సంపత్ వినయ్ బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్‌కు సోదరుడు. షణ్ముఖ్, సంపత్ కలిసి నగర శివారు పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన వైద్యురాలు మౌనికతో షణ్ముఖ్‌కు పరిచయముంది. అతడి ద్వారా 2015లో ఆమెకు సంపత్ పరిచయమవగా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సంపత్, మౌనికకు నిశ్చితార్థం కూడా జరిగింది. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామనుకోగా.. యువతి తల్లి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఫిబ్రవరి 28న పెళ్లి తేదీ నిర్ణయించారు. అయితే సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్‌ను అరెస్ట్ చేసేందుకు అతడి గదికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు.
ORR Accidents: సెలబ్రిటీలకు కలసిరాని ఓఆర్ఆర్.. రవితేజ తమ్ముడు మొదలు లాస్య నందిత దాకా !
తాజాగా ఈ కేసుపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ స్పందించింది. ఇక ఆమె మాట్లాడుతూ షణ్ముఖ్ బానే మాట్లాడే వాడు కానీ అతడు బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నేనిచ్చిన రివ్యూల వల్ల అతడి కుటుంబానికి, నాకు మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. షణ్ను అన్నయ్య సంపత్ వినయ్ ప్రేయసి మౌనిక నాకు మంచి ఫ్రెండ్. మౌనిక, సంపత్ చాలా ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. వీరికి 2021లోనే రోకా(పెళ్ళికి సంబందించిన ఈవెంట్) జరిగింది. ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది కానీ అంతలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లికి గ్యాప్ తీసుకున్నారు. అంతా సద్దుమణిగాక గతేడాది నవంబర్‌లో పసుపు దంచడం వంటి పెళ్లి పనులు మొదలుపెట్టి ఈ నెల 28న పెళ్లి అనుకుని కళ్యాణమండపం కూడా బుక్ చేసి లగ్నపత్రికలు పంచారు. ఫిబ్రవరి 28న పెళ్లి జరగాల్సి ఉంది అంటే మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడని, అది ఏ అమ్మాయైనా తట్టుకోలేదని పేర్కొంది. ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్ పంచుకోవాలనుకోవడం నాకైతే నచ్చలేదని పేర్కొన్నది. ఏదైనా ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలి. పైగా ఆమె అతడికి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకపోవడం కరెక్ట్ కాదని అన్నది. మౌనిక చాలా సెన్సిటివ్ అని పేర్కొన్న గీతూ తన గురించి ఆలోచిస్తేనే బాధేస్తోందని పేర్కొంది.