మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ ని పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని ఇన్‌క్రెడిబుల్ వుమెన్ అందరికీ, ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండి. #మహిళ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వరుణ్ విష్ చేశారు. ఈ పిక్ లో వరుణ్ నిహారిక, సుస్మిత, శ్రీజతో కలిసి పోజులిచ్చారు. వరుణ్ తన క్యాజువల్ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు. చుట్టూ ఉన్న మహిళలందరూ చాలా అందంగా కన్పిస్తున్నారు.
Read Also : Salaar : అతిథి పాత్రలో మరో స్టార్… రివీల్ చేసిన ప్రభాస్
ఇక వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా “గని” ఏప్రిల్ 8న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి రచన, దర్శకత్వం వహించారు. రెనైసాన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
