యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్ 29న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘వరుడు కావలెను’ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచనున్నారు.
Read Also : ‘ప్రేమమ్’ నుంచి ఆ హీరోయిన్ ని ఇష్టపడుతున్నా : విజయ్ దేవరకొండ
కాగా ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. కానీ దసరా వార్ లో పోటీ గట్టిగా ఉండడంతో ‘వరుడు కావలెను’ చిత్రబృందం వెనక్కి తగ్గింది. ఈ మేరకు అక్టోబర్ 15న విడుదల కావాల్సిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. రీసెంట్ గా విడుదలైన ‘వరుడు కావలెను’ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.