Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
- వారణాసి నుంచి బిగ్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Shoot Update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించి జక్కన్న తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే సినిమా ప్రధాన భాగానికి చెందిన భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘షూటింగ్లో ప్రధాన భాగం పూర్తయ్యింది. సినిమాలోని భారీ విజువల్ స్పెక్టకిల్ యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ చిత్రీకరించాం. ప్రస్తుతం కథను అనుసంధానించే చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది’ అని తెలిపారు. ఇక మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టదని, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చివరగా అక్టోబర్ తొలి వారంలో పూర్తి చేస్తామని రాజమౌళి చెప్పారు. జక్కన్న తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ఇప్పటికే వారణాసి చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న వారణాసి భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను చిత్రబృందం వేగవంతం చేయనుంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా వారణాసి విడుదల కానుంది.
We have completed a major portion of the shoot all the important big spectacle action sequences are done.
We are now into doing the smaller, interconnecting scenes so hopefully, by September, maybe a little bit into October, we should be finishing shooting.…
— Varanasi (@VaranasiMovie) June 26, 2026
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!