Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాంగ్లాదేశ్, జింబాబ్వే జట్లతో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు అద్భుత విజయాన్ని సాధించి ట్రోఫీని గెలుచుకుంది. 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు తరచూ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. యువ ఆటగాళ్లు బిలాల్ సమీ, అల్లాహ్ మహమ్మద్ గజన్ఫర్ లతో ఈ జట్టు మరింత బలంగా తయారైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టును ఆప్ఘన్ బౌలర్లు తక్కువ పరుగులకే పరిమితం చేశారు. ప్రారంభంలోనే ఫజల్హక్ ఫరూకీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సికిందర్ రజా (68), రయాన్ బర్ల్ (31) కాసేపు పోరాడి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రషీద్ ఖాన్ (3/41), మహమ్మద్ నబీ (2/25), బిలాల్ సమీ (2/27), ఫరూకీ (2/41) ధాటికి జింబాబ్వే కేవలం 169 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read
- Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
- UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
- New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
- IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
170 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ చక్కటి షాట్లతో అలరించగా, రెహమానుల్లా గుర్బాజ్ అతనికి మంచి సహకారం అందించాడు. పదో ఓవర్లో జట్టు స్కోరు 68 పరుగుల వద్ద గుర్బాజ్ అవుట్ అయ్యాడు. అనంతరం సిదిఖుల్లా అటల్ (6) కూడా త్వరగానే నిష్క్రమించాడు. అయితే తక్కువ లక్ష్యం ఉండటంతో ఆప్ఘన్ బ్యాటర్లు నిలకడగా ఆడారు.
ఆ తర్వాత కెప్టెన్ రహమత్ షా (43)తో కలిసి ఇబ్రహీం జద్రాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జద్రాన్ నాటౌట్‌గా 70 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆప్ఘనిస్థాన్ మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 35వ ఓవర్లోనే విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ విజయం ద్వారా ఆప్ఘన్ జట్టు ముక్కోణపు సిరీస్ విజేతగా నిలిచింది. ఇకపై ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే జట్ల మధ్య షార్జా వేదికగా మూడు టి20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.
తాజావార్తలు
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!