Site icon NTV Telugu

Vadde Naveen : వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Vadde Naveen

Vadde Naveen

Vadde Naveen : సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసి హిట్లు అందుకున్న నవీన్.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. విలన్ గా రీ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరిగింది. చివరకు తన సొంత బ్యానర్ లోనే రీ ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు. వడ్డే క్రియేషన్స్ అనే బ్యానర్ ను గతంలో ఆయన ప్రారంభించారు. ఆ బ్యానర్ లోనే హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి త్రిమూర్తులు అని టైటిల్‌ ఫిక్స్‌ చేశాడు. ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

Read Also : Tollywood : నిర్మాతల నిర్ణయం అంగీకరించట్లేదు.. రేపు ఫెడరేషన్ నిరసన

ఇందులో కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. లాఠీ పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కమల్‌ తేజ నార్ల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను నవీన్ సొంతంగానే నిర్మిస్తున్నాడు. అప్పట్లో మంచి హిట్ మూవీలు చేసిన నవీన్.. ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి. నిర్మాత వడ్డే రమేశ్‌ కుమారుడిగా నవీన్‌ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి సినిమాతో భారీ హిట్ అందుకుని.. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది లాంటి ఎన్నో సినిమాల్లో చేశాడు.

Read Also : Tollywood: సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతల కీలక ప్రకటన

Exit mobile version