AdiPurush: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. మరో వివాదంలో ఆదిపురుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AdiPurush: ఆదిపురుష్.. ప్రభాస్.. ఓం రౌత్.. బాలీవుడ్.. టాలీవుడ్ హీరో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆదిపురుష్ టీజర్ కానీ, పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదని గోల చేసినవారే.. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యాకా ప్రభాస్ పోస్టర్ బాలేదని, రాముడ్ని అవమానించారని, బొమ్మల సినిమా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఈ సినిమాకు రాజకీయ రంగులు అద్దుతున్నారు. హనుమంతుడిని అవమానించారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది.
ఇక మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆదిపురుష్ మరో వివాదంలో చిక్కుకొంది. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తమ పోస్టర్ నుంచి కాపీ కొట్టారని వానర్ సేన స్టూడియో ఆరోపణలు గుప్పించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ స్టూడియో రిలీజ్ చేసిన శివ యానిమేషన్ పోస్టర్ ను కాపీ కొట్టి ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేసారని చెప్పుకొచ్చారు. ఇక పోస్టర్లు రెండు ఒకేలా ఉన్నాయి. ప్రభాస్ రాముడి అవతారంలో విల్లు ఎక్కుపెట్టి గాల్లో తేలుతూ ఉండే ఈ పోస్టర్.. అచ్చు గుద్దినట్లు వారు డిజైన్ చేసిన శివ పోస్టర్ లానే ఉంది. “మేము రూపొందించిన శివ పోస్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. ఒరిజినల్ క్రియేటర్‌కు గుర్తింపు ఇవ్వకపోవడం బాధకరం”అంటూ వానర్ సేన స్టూడియో అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తో ఆదిపురుష్ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. మరి ఈ వివాదంపై మేకర్స్ ఏమంటారో చూడాలి.
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
తాజావార్తలు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!